Our @IAmVarunTej & @Itslavanya on the sets of #Antariksham9000Kmph #అంతరిక్షం9000kmph#AntarikshamOnDec21st pic.twitter.com/dU9Pnq6Fts
— First Frame Entertainments (@FirstFrame_Ent) September 24, 2018
తెలుగు న్యూస్ టుడే ➤ ఫిదా, తొలిప్రేమ సినిమాలతో హిట్‌లు కొట్టాడు మెగాహీరో వరుణ్ తేజ్. తన మొదటి సినిమాతోనే విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తన మొదటి సినిమాను సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి.. వరుణ్ తేజ్‌తో కలసి స్పేస్ కాన్సెప్ట్‌తో ‘అంతరిక్షం’ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
వరుణ్ ఫస్ట్‌లుక్, టైటిల్ ప్రకటించినప్పటినుంచీ ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి, అదితీ రావు హైదరీ నటిస్తున్నారు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రషూటింగ్‌కు సంబంధించిన ఫోటోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు. ఈ డిసెంబర్ 21న సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.