తెలుగు న్యూస్ టుడే ➤ దొంగను పట్టుకోవడానికి వెళితే పోలీసులనే దొంగలనుకుని గ్రామస్ధులు వారిపై దాడి చేసి ఓ ఇంట్లో పెట్టి తాళం వేశారు. ఈ వింత అనుభవం ధర్మవరం పోలీసులకు జరిగింది . తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ జిల్లాలోని మేళకుప్పంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
అనంతపురం జిల్లాలోని ధర్మవరం అర్బన్ పోలీస్ స్టేషన్ లో రామకృష్ణన్ అనే వ్యక్తి పై 40 కి పైగా దోపిడీ కేసులున్నాయి. కొన్నేళ్ల క్రితమే అతడు తమిళనాడులోకి పారిపోయాడు. అప్పటినుంచి అతడి కోసం గాలిస్తున్న పోలీసులకు కొన్ని రోజుల క్రితం రామకృష్ణన్ వేలూర్ జిల్లాలోని మేళకుప్పం గ్రామంలో ఓ మహిళను పెళ్లి చేసుకొని ఉంటున్నాడన్న సమాచారం అందింది. దీంతో ధర్మవరం ఎస్ ఐ శ్రీహర్ష నేతృత్వంలో ఐదుగురు పోలీసులు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మఫ్టీలో మేళకుప్పం చేరుకుని రామకృష్ణన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో, అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మఫ్టీలో వచ్చిన ఆంధ్ర పోలీసులను దొంగలుగా భావించి వారిపై దాడి చేసి ఓ ఇంట్లో తాళం వేశారు. సమాచారం అందుకున్న రత్నగిరి పోలీసులు అక్కడకు వెళ్లి వారు ఆంధ్ర పోలీసులని కన్ఫర్మ్ చేశారు. ఇంతలో రామ కృష్ణన్ పరారయ్యాడు. మళ్లీ మంగళవారం ఉదయం అక్కడే రామ కృష్ణన్ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు అతడిని చిత్తూరుకు తీసుకువచ్చారు.
పోలీసులను దొంగలుగా భావించి…. ?
Leave a Comment