ధన రూపంలో గజాననుడు !

తెలుగు న్యూస్ టుడే ➤ వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఆ గణనాధుణ్ని అనేక రూపాలతో కొలుస్తున్నారు , గుంటూరు జిల్లా లో కూడా గజాననుణ్ణి రూ.కోటిన్నర కరెన్సీ నోట్లతో అలంకరించారు . మంగళగిరి పూలమార్కెట్‌ సెంటర్‌లో సంకా బాలాజీగుప్తా బ్రదర్స్, వర్తక వ్యాపారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడికి మంగళవారం రూ.కోటిన్నర కరెన్సీ నోట్లతో ధనగణపతిగా అలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ ధనగణపతిని వీక్షించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

కాగా, కృష్ణా జిల్లా, మైలవరం 3వ వార్డులో శ్రీబాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ.లక్షతో కరెన్సీ గణపతిగా అలంకరించారు.

Leave a Comment