19 ఏళ్లకే చెస్‌ ఆటలో ‘గ్రాండ్‌ మాస్టర్‌’ : కార్తీక్‌ వెంకట్రామన్‌

తెలుగు న్యూస్ టుడే ➤ ఎత్తుల మీద పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తుచేస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ 19 ఏళ్లకే ప్రపంచ స్థాయి క్రీడాకారునిగా ఎదిగిన కార్తీక్‌ వెంకట్రామన్‌ చెస్‌ ఆటలో ‘గ్రాండ్‌ మాస్టర్‌’ (2,520 రేటింగ్‌) స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఎనిమిదేళ్ల వయస్సులో కార్తీక్‌ కు తల్లి ఇచ్చిన పుట్టినరోజు బహుమతి ప్రపంచ స్థాయి క్రీడాకారునిగా ఎదిగేందుకు ప్రేరణ కలిగింది. తిరుపతికి చెందిన కార్తీక్‌ వెంకట్రామన్‌ మరో ఏడాది లోపు ‘సూపర్‌ గ్రాండ్‌ మాస్టర్‌’ రేటింగ్‌ తెచ్చుకోవాలన్నదే తన ముందున్న లక్ష్యమని తన మనసులోని మాటను చెప్తున్నాడు . చెస్‌ ఆటలో ఊహకందని ఎత్తులు వేస్తూ.. తనకంటే మెరుగైన బ్లిడ్జ్, ర్యాపిడ్, క్లాసికల్‌ విభాగాల్లో ఉన్న ఆటగాళ్లను చిత్తుచేస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చాడు. తాజాగా ఈ నెల 4 నుంచి 16వ తేది వరకు టర్కీలో జరిగిన చెస్‌ ప్రపంచ స్థాయి జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొని 4వ గ్రాండ్‌ మాస్టర్‌ స్థానం దక్కించుకుని సొంతవూరు తిరుపతి చేరుకున్నాడు కార్తీక్. ప్రస్తుతం తిరుపతిలోని ఒక ప్రయివేట్‌ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

Leave a Comment