తెలుగు న్యూస్ టుడే ➤ కోరుకొండ సైనిక్ స్కూల్ విజయనగరం జిల్లాలో 2019-20 విద్యాసంవత్సరానికి గాను 6వ, 9వ తరగతులలో అడ్మిషన్లను ఆహ్వానిస్తూ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమి, ఖడక్వాస్లాలో ప్రవేశానికి విద్యాపరంగా మానసికంగా, శారీరకంగా విద్యార్థులను చిన్నప్పటి నుంచే ఈ స్కూల్లో సన్నద్ధం చేస్తారు. ఆలిండియా స్థాయిలో సైనిక్స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షలకు హజరయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలని వారు సూచించారు. ప్రవేశపరీక్ష – 2019 జనవరి 06 (ఆదివారం) ఉంటుందని తెలిపారు. వివరాల కొరకు 08922-246119, 246168 నంబర్లో గాని, www. sainikschoolkorukonda.org, www.sainikschooladmission.in వెబ్సైట్లను సందర్శించాలని పేర్కొన్నారు.
6వ తరగతి ప్రవేశం కొరకు బాలురు 31 మార్చి 2019 నాటికి 10-12 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇందులో 70 సీట్ల వరకు ఖాళీలున్నాయి. 9వ తరగతిలో ప్రవేశానికి బాలురు 31 మార్చి 2019 నాటికి 13-15 సంత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇందులో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
పాఠ్యప్రణాళిక – 10+2 సీబీఎస్ఈ విధానం
ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం – 2018 అక్టోబర్ 8వ తేదీ, చివరి తేదీ 26 నవంబర్, దరఖాస్తులను దాఖలు చేయు చివరి తేదీ 2018 డిసెంబర్ 01 (దరఖాస్తులను ఆన్లైన్లోనే చేయాలి. ఆఫ్లైన్లో వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.)
పరీక్ష కేంద్రాలు : విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, హైదరాబాద్, కరీంనగర్.
స్కాలర్షిప్ : అర్హులైన విద్యార్థులకు మెరిట్ ఆదాయ ఆథారిత, డిఫెన్స్ స్కాలర్షిప్స్ లభిస్తాయి. దారిద్రరేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తారు.
మొత్తం సీట్లలో 15 సీట్లు షెడ్యూల్డ్ కులాల వారికి, 7.5 శాతం షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయిస్తారు. మిగిలిన వాటిలో ఏపీ విద్యార్థులకు 67 శాతం, తెలంగాణ విద్యార్థులకు 33 శాతం సీట్లు కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు వారి ప్రాంత పురుష జనాభా ప్రాతిపధిక సీట్లను కేటాయిస్తారు. 25శాతం ఎక్స్ సర్వీస్మెన్తో సహా రక్షక శాఖ పిల్లలకు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల సీట్లకు తగిన అభ్యర్థులు రానైట్లెతే వారి సీట్లను జనరల్ కేటాగిరి విద్యార్థులకు కేటాయిస్తారు.