తెలుగు న్యూస్ టుడే ➤ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన 4 ఏళ్ళు తరువాత ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20, నుంచి 10 వేల పోస్టుల నియమకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. త్వరలో ఎన్నికలు సమీపించనుండటంతో టీడీపీ ప్రభుత్వం యువతను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా గ్రూప్ 1, 2, 3, డీఎస్సీతో పాటు పోలీస్ శాఖల్లో పోస్టుల భర్తీకి ముఖ్య మంత్రి చంద్రబాబు ఓకే చెప్పారు .
ఏ ఏ పోస్టుల భర్తీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటి వివరాలు :
గ్రూప్-1 ఖాళీలు – 150, గ్రూప్-2 ఖాళీలు – 250, గ్రూప్-3 ఖాళీలు – 1,670, డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు – 9,275, పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్పీఆర్బీ ఖాళీలు – 3,000, వైద్య శాఖలో ఖాళీలు – 1,604, ఇతర ఖాళీలు – 1,636, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు – 310, జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియేట్) పోస్టులు – 200, ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు – 10, ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు – 5, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు – 200, సమాచార పౌర సంబంధాల శాఖలో – 21 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది.
ఇవికాక ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి ద్వారా డీపీఆర్వో పోస్టులు – 4, ఏపీఆర్వో పోస్టులు – 12, డీఈటీఈ పోస్టులు – 5 పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదం తెలిపింది.