హైద్రాబాద్ న్యూస్ ➤ తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 29న దర్శకులు, రచయితల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు నాగబాల సురేశ్ కుమార్ తెలిపారు. ప్రముఖ సినీ రచయిత తోటపల్లి సాయినాథ్, బుర్రా సాయి మాధవ్ సారథ్యంలో రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో శిబిరం కొనసాగుతుంది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, తమ్మారెడ్డి భరద్వాజ, రచయితలు బుర్ర సాయినాథ్ శ్రీ శైలమూర్తి, ఉషా రాణి, దర్శకులు వి.యన్ ఆదిత్య, చంద్ర మహేశ్ పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు శిక్షణ శిబిరంలో పాల్గొంటారని ఆయన వివరించారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కె.వి. రమణాచారి, పరుచూరి గోపాల క్రిష్ణ, సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారని ఆయన తెలిపారు. శిక్షణ శిబిరంలో పాల్గొన దలచిన అభ్యర్థులు తొటపల్లి సాయినాథ్ 9394449777, తుమ్మల సత్యప్రసాద 9553838111, రామశంకర రావు 7989679533 నెంబరులను సంప్రదించాలని సూచించారు.
రవీంద్ర భారతిలో ఈ నెల 29న దర్శకులు, రచయితలకు శిక్షణ క్యాంపు !
Leave a Comment