శ్రీవారి దర్శనంలో పెద్దలు !

 

తెలుగు న్యూస్ టుడే ➤ తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తమిళనాడు సీఎం పళనిస్వామి ఈ తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరుడి సాధారణ సర్వదర్శనానికి 20 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 81,677 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,328 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Leave a Comment