తెలుగు న్యూస్ టుడే ➤ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పురందేశ్వరికి కీలక పదవి దక్కింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం గురువారం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఆమె మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పురందేశ్వరి ప్రస్తుతం మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు.
Leave a Comment