తెలుగు న్యూస్ టుడే ➤ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిన్నతిరుపతిని సందర్శించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నిన్న తిరుపతి విమానాశ్రయం సమీపంలో రూ. 99 కోట్లతో నిర్మించిన కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ… ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక తాజాగా ఇచ్చిన నివేదికల ప్రకారం పదేళ్లలో భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. రానున్న పది సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ఇక మనదేశపు వంటకాలు ప్రపంచానికే తలమానికమని, మన వంటలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ఆయన కోరారు. తిరుపతి కలినరీ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సౌకర్యాలు బాగున్నాయని కొనియాడారు. పాకశాస్త్ర విద్యాలయంతోపాటు రూ. 70 కోట్లతో నిర్మించిన కాకినాడ పర్యాటక సర్క్యూట్, రూ. 60 కోట్లతో చేపట్టిన నెల్లూరు పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్టులను తిరుపతి నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర పర్యాటక మంత్రి కేజే అల్ఫోన్స్, పర్యాటక శాఖ కార్యదర్శి లక్ష్మీవర్మ, రాష్ట్ర మంత్రులు అమరనాథరెడ్డి, అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు.
మన వంటలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి : వెంకయ్య నాయుడు !
Leave a Comment