రెండు పోలియో చుక్కలు ఇప్పుడు అవే ప్రమాదకరం… ?

తెలుగు న్యూస్ టుడే ➤పోలియో చుక్కలు వేయించండి మీ పిల్లలకు పోలియో బారి నుండి కాపాడండి అని ప్రతి సంవత్సరం ప్రభుత్వం రెండు విడతలుగా ఈ పోలియో చుక్కలు అందుబాటులో తెస్తోంది ఏది అందరికీ తెలిసిందే కానీ అవి ఎంత వరకు మన పసి పిల్లలకు భద్రమో ప్రశ్నర్ధకమే … పిల్లల పరుగులు ఆగకుండా వేసే పోలియో చుక్కలు కాస్తా ప్రమాదకరంగా మారితే..? ఇప్పడు ఇవే భయాలు లక్షలాది మందిని వెంటాడుతున్నాయి. రెండంటే రెండు పోలియో చుక్కలు అనేక మంది పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. అవును…మీరు విన్న ది నిజమే. 2016 తర్వాత పోలియో చుక్కలు వేయించిన తల్లిదండ్రులకు ఇది ఆందోళన కలిగే అంశమే. అంతేకాదు.. మన దేశాన్ని పోలియో ఫ్రీగా మార్చామని జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వ పెద్దలకు కచ్చితంగా ఇది అవమానమే.

2016 తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర , ఉత్తర ప్రదేశ్‌లలో వాడిన పల్స్ పోలియో వ్యాక్సిన్ కలుషితమైందని తేలింది. గత నెలలో ఆ పోలియో వ్యాక్సిన్ శాంపిల్స్‌ ను పరీక్షించినప్పుడు…అది వాడకూడని మందని రిపోర్ట్ వచ్చింది. కలుషిత మందు ఎక్కడ తయారైందో ఆరా తీయగా.. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఉన్న బయో మెడ్ ఫార్మా కంపెనీలో తయారైనట్లు తెలిసింది. దీంతో పోలీసులు బయో మెడ్ ఫార్మా ఎండీని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురు ఎండీల కోసం గాలిస్తున్నారు. పోలియోలో టైప్ 1, 2, 3 అనే మూడు రకాల వ్యాక్సిన్లు ఉంటాయి. ప్రసుతం టైప్ 1, టైప్ 3 వాక్సిన్లను మాత్రమే మన దేశంలో వాడాలి. ఇండియాను 2014లో పోలియో రహిత దేశంగా ప్రకటించాక టైప్ 2 వ్యాక్సిన్ ను మొత్తంగా ఉపసంహరించుకున్నారు. టైప్ 2 వ్యాక్సిన్ నిల్వల్ని ధ్వంసం చేశారు. అయితే ఘజియాబాద్‌లోని బయో మెడ్ ఫార్మా కంపెనీ…మాత్రం తయారు చేయకూడని టైప్ 2 వ్యాక్సిన్లనే ఉత్పత్తి చేస్తోంది. వాడకూడని వ్యాక్సిన్‌ను 2016 నుంచి సరఫరా చేస్తోంది. అప్పటి నుంచి ఆ పోలియో మందు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లో సరఫరా చేస్తూనే ఉన్నారు. ఆ వ్యాక్సిన్‌ను గత రెండేళ్ళుగా ఆయా రాష్ట్రాల్లో వాడుతూనే ఉన్నారు.

2016 తరువాత కలుషిత పోలియో చుక్కలు వేయించుకున్న వారిపై…ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందర్నీ భయపెడుతున్న ప్రశ్న. పిల్లలపై కల్తీ వ్యాక్సిన్ దుష్పరిణామం ఎలా ఉందో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్… ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కల్తీ వ్యాక్సిన్ వల్ల దుష్పరిణామాలు సంబంధించిన దాఖలాలు హైదరాబాద్ లో నమోదవ్వలేదని డిప్యూటీ డీఎంఓ డాక్టర్ ఈశ్వరి తెలిపారు. వాడకూడని పోలియో వ్యాక్సిన్‌‌ను తయారు చేయడం ఓ తప్పయితే… దానిని పరీక్షించుకుండానే కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడం మరో పెద్ద తప్పు. అంతా కలసి పిల్లల ప్రాణాలతో చెలగాడమాటడం అతి పెద్ద నిర్లక్ష్యం. ఈ తప్పుకు ఎవరు బాధ్యత వహిస్తారు..?

Leave a Comment