రైతు బంధు చెక్కుల పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రెవేశపెట్టిన తొలిదశ రైతు బంధు చక్కటి ప్రజాదరణ పొందింది . ప్రస్తుతం మరొకసారి ఈ చెక్కుల పంపిణీ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హోరు మొదలైయింది కావున కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ బతుకమ్మ చీరల పంపిణి నిలిపివేసిన సంగతి తెలిసిందే , మరలా రైతుల సంక్షేమ కోసం అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం … దానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో … తెలంగాణ వ్యాప్తంగా చెక్కుల పంపిణీ ప్రారంభమైంది. వ్యవసాయ అధికారులు చెక్కుల పంపిణీ ప్రారంభించారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం మామిడాలలో 456 మంది రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. నాలుగు లక్షల విలువైన చెక్కులను రైతులకు అందించినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

Leave a Comment