హీరో ప్ర‌భాస్ కి సాహో టీమ్ బర్త్ డే విషెస్ !

 

తెలుగు న్యూస్ టుడే ➤ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబ‌లి సినిమాతో అంత‌ర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్నసంగతి తెలిసిందే . ఆయ‌న ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చిత్రం ఒక్క‌టి కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో ఈ రెండు సినిమాల‌కి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కావ‌డంతో సాహో సినిమాకి సంబంధించిన యాక్ష‌న్ ఎపిసోడ్‌ని వీడియో ద్వారా విడుద‌ల చేశారు.
అబుదాబిలో 30 రోజుల పాటు జ‌రిగిన యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం 60 రోజుల ప్రిప‌రేషన్, 400కి పైగా క్రూ ప‌నిచేశారు. తాజాగా విడుద‌లైన వీడియో ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తుంది . సాహో కూడా అభిమానుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుందని తెలుస్తుంది. శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. వ‌చ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్ర‌భాస్ ..రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తుండ‌గా ఈ మూవీ ఇట‌లీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ నేడు రానున్న‌ట్టు తెలుస్తుంది.

Leave a Comment