తెలుగు న్యూస్ టుడే ➤ గ్రేటర్ భాగ్యనగరంలో 10కే రన్ మరోసారి నగరవాసులను పలకరించనుంది. నవంబర్ 25న నెక్లెస్ రోడ్లో ఫ్రీడమ్ 10కే రన్‌ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ నిర్మాత, హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ డైరెక్టర్ డి. సురేష్ బాబు, టాలివుడ్ నటుడు నవదీప్, నటి తేజస్విని, ఫ్రీడం వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) పి.చంద్రశేఖర రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం హైదరాబాద్ 10కే రన్ పాటను, లోగోలను ఆవిష్కరించారు. నవంబర్ 25న నెక్లెస్ రోడ్లో ఘనంగా 10కే రన్‌ను ప్రారంభించనున్నట్లు సురేష్ బాబు పేర్కొన్నారు.
Leave a Comment