తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్విమ్మర్ కుమారస్వామి సత్తా చాటాడు. మాస్టర్స్ అక్వాటిక్ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డిలో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి టోర్నీ లో స్వర్ణం, రెండు రజతాలు, కాంస్యంతో కలిపి మొత్తం 4 పతకాలను కొల్లగొట్టాడు. 55–59 వయో విభాగంలో బరిలోకి దిగిన కుమారస్వామి 200మీ. వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్‌లో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు. 100మీ. బ్యాక్‌స్ట్రోక్, 50మీ. బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్లలో రన్నరప్‌గా నిలిచి రెండు రజతాలను సొంతం చేసుకున్నారు. 50మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలో మూడోస్థానంతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
Leave a Comment