తెలుగు న్యూస్ టుడే ➤ హైదరాబాద్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ స్మాషర్స్ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ స్మాషర్స్ 4–1తో ఎన్తు షట్లర్స్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఎన్తు షట్లర్స్ 4–3తో బీబీఏ టైటాన్స్‌పై గెలుపొందగా… హైదరాబాద్ స్మాషర్స్ 4–2తో ముంబై మాస్టర్స్‌ను ఓడించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టోర్నమెంట్ చైర్మన్ టీవీఎన్ రాజేశ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
Leave a Comment