
తెలుగు న్యూస్ టుడే ➤ డిఫరెంట్ కామెడి, లవ్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించి డైరెక్టర్‌గా తనకంటూ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రవిబాబు. ఒక వైపు ముఖ్య పాత్రలలో నటిస్తూ మరో వైపు తన దర్శకత్వ ప్రతిభను చాటుకుంటున్నాడు . ప్రస్తుతం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి పంది పిల్లపై అదుగో అనే పేరుతో సినిమా తీసాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనప్పటికి రిలీజ్ విషయంలో కాస్త లేట్ అవుతూ వచ్చింది. నవంబర్ 7న దీపావళి శుభాకాంక్షలతో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు రవిబాబు పోస్టర్ ద్వారా ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు ఈ సినిమాని నిర్మించారు . అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల కొన్ని ప్రమోషనల్ వీడియోలు విడుదల కాగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి పందిపిల్లతో రవిబాబు చేయించిన మ్యాజిక్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో తెలియాంటే దీవాళి వరకు ఆగాల్సిందే.