శర్వా ‘పడి పడి లేచే మనసు’ టీజర్

తెలుగు న్యూస్ టుడే ➤ శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం పడి పడి లేచే మనసు. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలకానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. భారీ డైలాగ్స్ ఏం లేకుండా రొమాంటిక్ ట‌చ్‌తో సింపుల్‌గా క‌ట్ చేశాడు ద‌ర్శ‌కుడు. టీజ‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి డాక్టర్‌గా, శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాతో శ‌ర్వా మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోనున్నాడ‌ని తెలుస్తుంది.

Leave a Comment