‘అరవింద సమేత వీర రాఘవ’ సరదా టీమ్ !

తెలుగు న్యూస్ టుడే ➤ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో చేస్తున్న చిత్రం అర‌వింద స‌మేత‌. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 11న ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించి సాంగ్ చిత్రీక‌రణ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన మ్యూజిక్ విడుద‌ల కాగా, ఇవి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో సినిమాని జ‌నాల‌లోకి తీసుకెళ్ళేందుకు మ‌రిన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు మేక‌ర్స్‌. రీసెంట్‌గా చిత్రానికి సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్స్ కొన్ని విడుద‌ల కాగా, ఇవి అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఫోటొల‌ని బ‌ట్టి చూస్తుంటే షూటింగ్ అంతా స‌ర‌దాగా సాగిన‌ట్టు తెలుస్తుంది.

రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ని ఘ‌నంగా నిర్వ‌హించి సినిమాపై ఆస‌క్తిని పెంచాల‌ని టీం భావిస్తుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, నాగ బాబు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడు.

Leave a Comment