ట్రిపుల్ తలాఖ్ పై కేంద్రం తీర్పు !

 

తెలుగు న్యూస్ టుడే ➤ ట్రిపుల్ తలాఖ్ పై ముస్లిం మహిళలు చేస్తున్న న్యాయ పోరాటం నేడు తీర్పు వెలువడింది. నేడు ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కేంద్రం. ట్రిపుల్ తలాఖ్ ను నేరంగా పరిగణించే ఆర్డినెన్స్ ను… కేంద్ర కేబినెట్ ఈ రోజు (సెప్టెంబర్ -19) న అప్రూవ్ చేసింది. ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) బిల్లు – 2017… ఇప్పటికే లోక్ సభలో బిల్ పాస్ అయింది. అయితే రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా ఈ బిల్లు పాస్ కాలేదు. విపక్షాల ఆందోళనలతో… ఆగస్టులో ఈ బిల్లుకి మూడు సవరణలు చేసింది ప్రభుత్వం.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం….ట్రిపుల్ తలాఖ్ ను నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఫైన్ విధిస్తారు. ట్రిపుల్ తలాఖ్ ను రాజ్యాంగవిరుద్దం, అక్రమం అంటూ గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

Leave a Comment